![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.....పెద్దసారు ఇంటికి వస్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు.. పెద్దసారు డల్ గా ఉండడంతో ఏమైందని రుద్ర అడుగుతాడు. ఏం కాలేదని పెద్దసారు చెప్తాడు కానీ వంశీ అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న రుద్ర పట్టరాని కోపంతో పదండి పెద్దనాన్న అని పెద్దసారు చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అక్కడ పెద్ద గొడవ అయ్యేలా ఉంది ఎలాగైనా ఆపాలని వీరు, ఇషిక అనుకుంటారు.
మరొకవైపు మన అల్లుడు గారు చూసావా ఎంత మంచోడో.. మనం కూడా పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్ళడానికి పాస్ పోర్ట్ తీసుకొని వచ్చాడని పైడిరాజు పాస్ పోర్ట్ చూపిస్తాడు. అక్కడ మంచి డాక్టర్స్ ఉంటారు.. మీ అమ్మ బాగుంటుంది అనగానే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఎందుకో డౌట్ గా ఉంది.. నా కూతురు జీవితం బాగుంటుందంటే ఈ పెళ్లి జరిపించు.. లేదంటే ఆపెయ్ దేవుడా అని గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ మొక్కుకుంటుంది. మరొకవైపు రుద్ర వచ్చి ఎవడ్రా మా పెద్దనాన్నని కొట్టిందని రౌడీలను కొడతాడు.ఆ తర్వాత గంగని కలవడానికి లోపలికి వెళ్తారు. వద్దని పైడిరాజు పెళ్లికొడుకు అడ్డుపడతారు. అప్పుడే గంగ వస్తుంది.
నీతో మాట్లాడతా అంటే వాళ్ళు ఆపుతున్నారు.. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని పెద్దసారు అడుగుతాడు. ఇష్టమేనని గంగ అంటుంది. లేదు దానికి ఇష్టం లేదు.. నా ఆరోగ్యం బాగుపడుతుందని చేసుకుంటుందని గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ అంటుంది. లేదు నా ఇష్టప్రకారం చేసుకుంటున్నాను.. మా అమ్మ ఆరోగ్యం బాగవుతుందని గంగ అంటుంది. మీ అమ్మ ఆరోగ్యం బాగవ్వాలంటే నేను హెల్ప్ చేస్తాను.. అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకోకని పెద్దసారు అంటాడు. మీరు చేస్తారు కానీ అందరు అలా అనుకోరు కదా అని గంగ అంటుంది. పదండి పెద్దనాన్న మీరు వాళ్ళని మన అనుకున్నారు.. వాళ్ళు అనుకోవడం లేదని రుద్ర అంటాడు.. దయచేసి ఈ పెళ్లికి అడ్డుపడకండి అని గంగ వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యగానే వాళ్లు వెళ్ళిపోతారు. తరువాయి భాగంలో ఇది పెళ్లి కాదు.. ఇదంతా నాటకం.. ఇదే కదా మా సర్ బిజినెస్.. ఆ తర్వాత దుబాయ్ కి అమ్ముకోవడం అని రౌడీలు మాట్లాడుకుంటుంటే లక్ష్మీ వింటుంది. విని అబ్బాయి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఆ అబ్బాయి వీరుకి ఫోన్ చేసి గంగ వాళ్ళ అమ్మకి నిజం తెలిసిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |